ఈ చెన్నై కంపెనీ ఉద్యోగుల పంట పండింది... గిఫ్టులుగా కార్లు, బైకులు!
- ఉద్యోగులకు కార్లు, బైకులు గిఫ్ట్‌గా ఇచ్చిన టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ సంస్థ
- 28 మందికి కార్లు, 29 మందికి మోటారు సైకిళ్లు అందజేత
- ఉద్యోగుల కల నెరవేర్చేందుకే గిఫ్ట్‌లు అంటున్న సంస్థ ఎండీ శ్రీధర్ కన్నన్
చెన్నైకి చెందిన ఓ సంస్థ ఉద్యోగుల పంట పండింది. ఉద్యోగులకు ఆ సంస్థ బంపర్ ఆఫర్ ఇచ్చింది. సిబ్బంది కృషికి గుర్తింపుగా భారీ బహుమతులు ఇచ్చింది. ఏకంగా కార్లు, బైకులు బహుమతిగా అందజేసింది. చెన్నైకి చెందిన టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ సంస్థ ఈ కీలక నిర్ణయాన్ని అమలు చేసింది.
సంస్థను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేలా ప్రోత్సహించేందుకు ఉద్యోగుల్లో 28 మందికి కార్లు, 29 మందికి మోటారు సైకిళ్లు గిఫ్ట్‌లుగా ఇచ్చింది. బహుమతిగా అందజేసిన కార్లలో హ్యూందాయ్, టాటా, మారుతీ సుజుకీ, మెర్స్‌డెస్ బెంజ్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి. ఈ సందర్బంగా కంపేనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ మాట్లాడుతూ.. కంపెనీ విజయంలో కీలక భూమిక పోషిస్తున్న ఉద్యోగులను గుర్తించడంలో భాగంగా భారీ బహుమతులు అందించినట్లు తెలిపారు. ఉద్యోగులే తమకు విలువైన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు.
తమ కంపెనీలో మొత్తం 180 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వారిలో చాలా మందికి కారు, బైక్ కొనుగోలు చేయాలన్న ఆశ ఉంటుందని, వారి కల నెరవేర్చేందుకు వీటిని గిఫ్ట్ గా అందించినట్లు తెలిపారు. అయితే కారు, బైక్ కొనుగోలుకు సంబంధించి కొంత సీలింగ్ నిర్దేశించామని చెప్పారు. కంపెనీ నిర్ణయించినది కాకుండా ఇంకా మంచి వాహనం కొనుగోలు చేయాలని ఉద్యోగి భావిస్తే మిగిలిన మొత్తం చెల్లించి కొనుగోలు చేసుకునే అవకాశం వారికి కల్పించినట్లు తెలిపారు. ఇకపోతే వివాహ వేడుకకు తమ సిబ్బందికి ఇంతకు ముందు రూ.50వేలు అందించేవాళ్లమని, దాన్ని ఈ ఏడాది నుండి లక్షకు పెంచుతున్నట్లు వెల్లడించారు.