హైదరాబాద్ టీ20లో టాస్ గెలిచిన టీమిండియా
- టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 5 ఓవర్లలో 1 వికెట్ కు 63 పరుగులు చేసిన భారత్
హైదరాబాదులో నేడు టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరిదైన మూడో టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 23 పరుగుల స్కోరు వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన ఓపెనర్ అభిషేక్ శర్మ బంగ్లా బౌలర్ టాంజిమ్ హసన్ సకీబ్ బౌలింగ్ లో అవుటయ్యాడు.
ప్రస్తుతం భారత్ స్కోరు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 63 పరుగులు. ఓపెనర్ సంజు శాంసన్ 36, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 2-0తో సిరీస్ గెలిచింది. దాంతో ఇవాళ్టి మూడో టీ20 నామమాత్రంగా మారింది. అయితే క్లీన్ స్వీప్ చేయాలని భారత్, పరువు కోసం బంగ్లాదేశ్ ప్రయత్నించే అవకాశాలుండడంతో... పోరు ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నారు.