హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ
- ఇటీవల హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం
- 48 స్థానాల్లో విజయం సాధించిన కమలం పార్టీ
- ఈ నెల 17న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న సైనీ
ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తెలిసిందే. వరుసగా మూడో పర్యాయం హర్యానా పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంది. ఇక, గత పర్యాయం సీఎంగా వ్యవహరించిన నాయబ్ సింగ్ సైనీ మరోమారు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. బీజేపీ హైకమాండ్ నాయబ్ సింగ్ పేరునే ఖరారు చేసింది.
సైనీ ఈ నెల 17న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మేరకు పంచకులలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని కేంద్రమంత్రి, హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు.
హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా... ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు గెలిచి అధికారం కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 46 కాగా, బీజేపీ రెండు స్థానాలు ఎక్కువే గెలిచింది.
ఇక, కాంగ్రెస్ పార్టీ మరోసారి విపక్ష హోదాకే పరిమితమైంది. హస్తం పార్టీకి 37 స్థానాలు దక్కగా... ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ 2, ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు.