ఆ కెమెరామన్ తో మాకు సంబంధం లేదు: దివ్వెల మాధురి
- ఇటీవల తిరుమల వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి
- ఫొటో షూట్ చేసిందంటూ మాధురిపై కేసు
- తాను ఒక్క ఫొటో కూడా తీసుకోలేదన్న మాధురి
- మీడియా చానళ్ల వారే తమ వెంట ఓ కెమెరామన్ ను పంపించారని ఆరోపణ
- అతడు వద్దన్నా వినకుండా వెంటపడ్డాడని వివరణ
ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి తిరుమలలో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, తిరుమల కొండపై ఫొటో షూట్ చేసిందంటూ దివ్వెల మాధురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మాధురి వివరణ ఇచ్చారు.
తిరుమలలో తాను ఎలాంటి ఫొటోషూట్ చేయలేదని, ఒక్క రీల్ కూడా రికార్డ్ చేయలేదని, దీనికి సంబంధించి ఇన్ స్టాగ్రామ్ లో ఎలాంటి పోస్టు పెట్టలేదని స్పష్టం చేశారు. తమ వెంట వచ్చిన కెమెరామన్ మీడియాకు చెందిన వ్యక్తి అని, అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మాధురి వెల్లడించారు. వద్దంటున్నా వినకుండా అతడు తమ వెంటబడ్డాడని వివరించారు. మీడియా చానళ్లకు చెందిన ప్రతినిధులే ఆ కెమెరామన్ ను తన వెంట పంపించారని ఆరోపించారు.
తాను తిరుమల మాడవీధుల్లో తన సొంత సెల్ ఫోన్ తో సాయంత్రం వేళ ఒక్క ఫొటో కూడా తీసుకోలేకపోయానని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. నాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు... నేను తిరుమలలో ఒక్క ఫొటో కానీ, వీడియో కానీ తీసినట్టు చూశారా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు.