కెనడా ప్రధానితో భారత ప్రధాని మోదీ చర్చలు

  • లావోస్‌లో భారత్ – ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు
  • మోదీతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చర్చలు
  • తదుపరి చేయాల్సిన పనులు ఉన్నాయంటూ మోదీతో ట్రూడో చెప్పినట్లు కెనడా మీడియా వెల్లడి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లావోస్ పర్యటనలో ఉన్నారు. లావోస్‌లో భారత్ – ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. గురువారం లావోస్ పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ .. ఆయా దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీతో శుక్రవారం భేటీ అయినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వెల్లడించారు. లాహోస్ లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో కలిసినట్లుగా పేర్కొన్నారు. 

ఖలిస్థానీ ఉగ్రవాది హర్ దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందంటూ ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీతో భేటీ అయినట్లు జస్టిన్ ట్రూడో పేర్కొన్నట్లు, తదుపరి చేయాల్సిన పనులు ఉన్నాయని మోదీతో చెప్పినట్లు కెనడా మీడియా వెల్లడించింది.


More Telugu News