ఉప్పల్‌లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌ను అడ్డుకుంటామంటూ వీహెచ్‌పీ హెచ్చరిక
- ఉప్పల్ స్టేడియంలో ట్వంటీ 20 మ్యాచ్
- తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న వీహెచ్‌పీ
- నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోయే భారత్-బంగ్లాదేశ్ ట్వంటీ 20 మ్యాచ్‌కు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడి నేపథ్యంలో వీహెచ్‌పీ ఈ హెచ్చరిక జారీ చేసింది. భారత్-బంగ్లా మ్యాచ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించింది.
ఇక్కడ మ్యాచ్‌లో ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా పోయేదేమీ లేదని, కానీ అక్కడ బంగ్లాదేశ్‌లో హిందువులు మాత్రం లక్ష్యంగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మ్యాచ్‌ను అడ్డుకుంటామని, తర్వాత జరిగి పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించింది. వీహెచ్‌పీ హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ట్వంటీ 20 మ్యాచ్ కోసం ఇరుజట్లు ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్నాయి. ఈ సిరీస్‌లో దూకుడుగా ఉన్న భారత్ మ్యాచ్‌ను క్లీన్ స్వీప్ చేస్తామని ధీమాగా ఉంది. టీమిండియాను కట్టడి చేయాలని బంగ్లా టీమ్ భావిస్తోంది.
ఉప్పల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులను వర్షం కలవరపెడుతోంది. శనివారం చిన్నపాటి జల్లులు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే స్వల్ప వర్షం కురిస్తే మ్యాచ్‌కు వచ్చే ఇబ్బంది ఉండదు.