ఏపీ సీఎం సహాయ నిధికి దాతల విరాళాలు

  • విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం 
  • మంత్రి నారా లోకేశ్‌కు విరాళాలు అందజేసిన దాతలు
  • దాతలకు అభినందలు తెలిపిన లోకేశ్
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపుతో మేము సైతం అంటూ దాతలు స్పందిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు ఇప్పటికే పెద్ద ఎత్తున సీఎం సహాయ నిధికి విరాళాలు అందించారు. మరో పక్క టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు నియోజకవర్గాల్లో విరాళాలను సేకరించి సీఎం సహాయ నిధికి అందిస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లి నివాసంలో శుక్రవారం మంత్రి నారా లోకేశ్ కు పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. 

సంతనూతలపాడు నియోజకవర్గంలోని వివిధ మండలాలు, మహిళా సంఘాలు సేకరించిన, వివిధ విద్యాసంస్థలు అందజేసిన సుమారు రూ.1.27 కోట్ల విరాళాన్ని ఎమ్మెల్యే బి విజయకుమార్ ఆధ్వర్యంలో నారా లోకేశ్ కు అందించారు. ఇందులో చీమకుర్తిలోని గెలాక్సీ గ్రానైట్స్ యజమానుల అసోసియేషన్ తరపున అధ్యక్షుడు సుబ్బారెడ్డి, ప్రతినిధులు బద్రీనారాయణ, రవి, కృష్ణ, నాన్ వాణి రూ.60 లక్షల విరాళాన్ని ఇచ్చారు. అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్య సంఘం తరపున రూ.31.50 లక్షలు అందించారు. 

చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రూ.20.36 లక్షలు, మదనపల్లి ఇంజనీరింగ్ కళాశాల తరపున విజయభాస్కర్ రూ.19 లక్షలు, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్ స్టిట్యూట్ తరపున వాసిరెడ్డి విద్యాసాగర్ రూ.10లక్షలు, కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపున రూ.10లక్షల చెక్కును లోకేశ్‌కు అందజేశారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రూ.8.81లక్షలు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు రూ.4.65 లక్షలు, కంచెర్లపల్లి సతీశ్ రూ.లక్ష, నందిపాటి జోగారావు రూ.1.92 లక్షలు, చెరుకూరి నారాయణరావు రూ.10,116లు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వీరికి లోకేశ్ అభినందనలు తెలియజేశారు. 


More Telugu News