తెలుగు రాష్ట్రాల ప్రజలకు నారా లోకేశ్, కేటీఆర్ దసరా శుభాకాంక్షలు
తెలుగు రాష్ట్రాల్లో దసరా వేడుకలు సందడిగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
విజయదశమిని సంతోషంగా జరుపుకుందాం: నారా లోకేశ్
తెలుగు ప్రజలందరికీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్రజల్ని హింసించిన జగనాసురుడి దుష్టపాలనను జనమే అంతమొందించారు. వైసీపీ చెడుపై కూటమి మంచి విజయం సాధించింది. వరద రూపంలో వచ్చిన విపత్తుపై విజయం సాధించాం. వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్, హెచ్‌సీఎల్ విస్తరణ, టీసీఎస్ తెచ్చుకున్నాం. పోలవరం సాకారం కానుంది. రైల్వేజోన్ శంకుస్థాపన జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం చేయూతనందిస్తోంది. ఇన్ని మంచి విజయాలు అందించిన ఈ విజయదశమిని సంతోషంగా జరుపుకుందాం. ప్రజా సంక్షేమం- రాష్ట్రప్రగతే ధ్యేయంగా శ్రమిస్తున్న మంచి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన ట్వీట్ చేశారు.
సరదాలు సంతోషాలతో దసరా పండుగ: కేటీఆర్
‘‘శమీ శమయతే పాపం..శమీ శత్రు వినాశనీ !. అర్జునస్య ధనుర్ధారీ... రామస్య ప్రియ దర్శినీ!. జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలి !. పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలి!. అలయ్ బలయ్ ఆత్మీయ ఆలింగనాలు.. సరదాలు సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ... అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!’’ అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.