ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్‌ను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

  • హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించిన ప్రభుత్వం
  • 60 రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశం
  • ఎస్సీ వెనుకబాటుతనాన్ని ఉపకులాల వారీగా అధ్యయనం చేయనున్న కమిషన్
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను నియమించింది. 60 రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీల వెనుకబాటుతనాన్ని ఉపకులాల వారీగా ఈ ఏకసభ్య కమిషన్ అధ్యయనం చేయనుంది.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పలు పర్యాయాలు సమావేశమైన ఈ కమిటీ... ఎస్సీ రిజర్వ్‌డ్ కులాల వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు ఏకసభ్య జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం షమీమ్ అక్తర్‌ను నియమించింది.


More Telugu News