సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
- సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనన్నట్లు జీవోలో పేర్కొన్న ప్రభుత్వం
- సామాజిక, ఆర్థిక, విద్య అంశాలపై సర్వే
- సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు
సమగ్ర కులగణనపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, విద్య అంశాలపై సర్వే చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. ఈ సర్వే బాధ్యతను ప్రణాళిక శాఖకు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు. 60 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని జీవోలో పేర్కొన్నారు.