బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ 'లక్కీ భాస్కర్'
- లక్కీ భాస్కర్ ప్రమోషన్స్‌కు సన్నద్ధమవుతున్న టీమ్
- అక్టోబర్ 21న ట్రైలర్ విడుదల
- అక్టోబర్ 31న సినిమా విడుదల
''నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా బ్యాంకింగ్ సెక్టార్ మీద మన దేశంలో సరైన సినిమా రాలేదు. ఆ నేపథ్యంలో ఒక బలమైన కథతో సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో ఉంది. 1980-90 కాలంలో జరిగే కథ ఇది. వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసుకొని రాసుకున్న కల్పిత కథ. ఇప్పటివరకు నేను ఎక్కువ సమయం తీసుకొని రాసిన కథ ఇదే. ఈ కథ కోసం ఎంతో పరిశోధన చేశాను. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుంది" అంటూ దర్శకుడు వెంకీ అట్లూరి 'లక్కీ భాస్కర్' చిత్రం గురించి చెప్పుకొచ్చారు.
ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లక్కీ భాస్కర్. మహా నటి, సీతారామం వంటి విజయాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో కథానాయకుడు. ఈ చిత్రాన్ని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. అక్టోబర్ 31వ తేదీన దీపావళికి చిత్రం విడుదల కానుంది. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక, నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు.
దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "ఈ నెల 21వ తేదీన ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. అప్పటినుంచి సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు నేను తీసిన సినిమాల్లో ఇది విభిన్న చిత్రంగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరూ లోతుగా టచ్ చేయని బ్యాంకింగ్ సెక్టార్ మీద కథ ఇది. తప్పకుండా అందర్ని అలరిస్తుంది" అన్నారు.
నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ... "అక్టోబర్ 21న ట్రైలర్ విడుదల చేస్తాం. అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నాం. అక్టోబర్ 30 నుంచి ప్రీమియర్లు ప్రదర్శించనున్నాం. సినిమా పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. అందుకే ముందు రోజు సాయంత్రం నుంచే తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించాం. కంటెంట్ పరంగా ఈ మధ్య కాలంలో రూపొందిన గొప్ప తెలుగు సినిమాల్లో 'లక్కీ భాస్కర్' ఒకటిగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను.
కథ కొత్తగా ఉంటుంది. సాంకేతికంగా కూడా సినిమా గొప్పగా ఉంటుంది. ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు పెరిగిపోతాయి. సినిమా మంచి వసూళ్లు రాబడుతుందనే నమ్మకం ఉంది. సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడల్లో ఒకేసారి విడుదల చేస్తున్నాం. హిందీలో మాత్రం ఒక వారం తర్వాత విడుదలవుతుంది" అన్నారు.