నందిగం సురేశ్ ఆరోగ్యం బాగుందన్న వైద్యులు... తిరిగి జైలుకు తరలింపు!

  • గుంటూరు జీజీహెచ్ లో సురేశ్ కు వైద్య పరీక్షలు
  • సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు
  • తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తరలింపు
గుంటూరు జిల్లా జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజం, ఛాతీ నొప్పి వస్తోందని జైలు అధికారులకు ఆయన చెప్పడంతో... ఆయనను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. జీజీహెచ్ లో ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేశారు. అనంతరం సురేశ్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో, ఆయనను ఆసుపత్రి నుంచి తిరిగి జైలుకు పోలీసులు తరలించారు. 

మరోవైపు నందిగం సురేశ్ వచ్చిన సందర్భంగా ఆసుపత్రి వద్దకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. సురేశ్ ను చూసిన ఆయన భార్య కంటతడి పెట్టుకున్నారు. వైసీపీ శ్రేణులకు అభివాదం చెపుతూ పోలీసులతో కలిసి సురేశ్ అక్కడి నుంచి జైలుకు వెళ్లిపోయారు.


More Telugu News