నవనీత్ రాణాను బీజేపీ రాజ్యసభకు పంపిస్తుంది: రవిరాణా

  • మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోరని వెల్లడించిన భర్త
  • దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర నేతలు తనతో చెప్పారని వెల్లడి
  • లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన నవనీత్ కౌర్ రాణా
నవనీత్ రాణా (నవనీత్ కౌర్)ను బీజేపీ రాజ్యసభకు పంపిస్తుందని, ఈ మేరకు హామీ ఇచ్చారని ఆమె భర్త, ఎమ్మెల్యే రవిరాణా వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయబోదని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... నవనీత్ రాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదనే తాను భావిస్తున్నానని, రాజ్యసభకు వెళుతుందని అన్నారు. ఈ విషయాన్ని తనకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర సీనియర్ నేతలు పలుమార్లు చెప్పారన్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో నవనీత్ (కౌర్) రాణా అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే 2024లో ఆమె బీజేపీలో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు టిక్కెట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ నేత చేతిలో ఓడిపోయారు. అయితే త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఆమె బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో రవిరాణా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, రవిరాణా 2009 నుంచి బడ్నేరా బరిలో స్వతంత్ర అభ్యర్థిగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు.


More Telugu News