తెలంగాణకు మూడు రోజుల పాటు వర్ష సూచన

  • పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడి
  • ఈ నెలలో బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిక
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెలలో బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. 

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షపాతం నమోదయింది. ఈరోజు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. 

రేపు భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 

ఆదివారం నాడు వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.




More Telugu News