టాటా ట్రస్ట్ చైర్మన్‌గా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా నియామకం
- టాటా ట్రస్ట్ చైర్మన్‌గా నోయెల్ టాటాకు ఆమోదం తెలిపిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు
- రతన్ టాటా సవతి తల్లి కొడుకే నోయెల్ టాటా
- 2000 ఆరంభంలో కంపెనీలోకి అడుగు
- నాటి నుంచి కంపెనీ ఎదుగుదలకు విశేషంగా కృషి చేస్తున్న నోయెల్ టాటా
రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూపు నిర్వహణకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా రతన్ టాటా పిన సోదరుడు నోయల్ టాటా నియమితులయ్యారు. ఈ మేరకు ముంబైలో ఇవాళ (శుక్రవారం) జరిగిన బోర్డు సమావేశంలో కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
నోయెల్ టాటా ప్రస్తుతం టాటా స్టీల్, టైటాన్ కంపెనీలకు వైస్ చైర్మన్‌గా ఉన్నారు. నోయెల్ టాటా 2000 ఆరంభంలో టాటా గ్రూపులో అడుగుపెట్టారు. ఆ నాటి నుంచి టాటా గ్రూప్ పురోగమనంలో ఆయన కూడా కీలక వ్యక్తిగా కృషి చేస్తున్నారు. సర్ రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ల సమావేశం అనంతరం ఇవాళ ఆయనను ఛైర్మన్‌గా ఎంపిక చేశారు.
కాగా దివంగత రతన్ టాటా 1937లో సాంప్రదాయ పార్శీ కుటుంబంలో జన్మించారు. అయితే ఆయన 10వ ఏట తల్లిదండ్రులు నావల్ టాటా - సూనీ టాటా విడాకులు తీసుకున్నారు. దీంతో రతన్ టాటా తన అమ్మమ్మ వద్ద పెరిగాయి. తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నారు.
నోయెల్ టాటా తల్లి సిమోన్ టాటాయే రతన్ టాటాకు సవతి తల్లి. ఆమె ఒక ఫ్రెంచ్-స్విస్ కాథలిక్. ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు ఆమె ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
ఇక రతన్ టాటా తమ్ముడు జిమ్మీ వ్యాపారంలో అడుగుపెట్టలేదు. దక్షిణ ముంబైలోని కొలాబాలో నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం రెండు బెడ్‌రూమ్‌లు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆయన నివసిస్తున్నారు.
కాగా టాటా సన్స్ ట్రస్ట్ కింద మొత్తం 14 ట్రస్ట్‌లు ఉన్నాయి. అయితే టాటా సన్స్ యాజమాన్యంలో ఎక్కువ భాగాన్ని సర్ రతన్ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లే నిర్వహిస్తుంటాయి. ఈ రెండు ట్రస్టులు ఉమ్మడిగా 50 శాతానికి పైగా యాజమాన్యాన్ని కలిగివున్నాయి. టాటా ట్రస్ట్‌లో ప్రస్తుతం వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్, మెహ్లీ మిస్త్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.