వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు అస్వ‌స్థ‌త‌.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

  • గుంటూరు జైలులో ఉన్న నందిగం సురేశ్‌
  • ఇవాళ అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో జీజీహెచ్‌కు త‌ర‌లింపు
  • చంద్ర‌బాబు ఇంటిపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ
  • ఓ మహిళ హత్య కేసులోనూ ఆరోపణలు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ గుంటూరు జైలులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా ఆయ‌న అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఛాతీ, భుజంలో నొప్పి వ‌స్తున్న‌ట్లు చెప్ప‌డంతో జైలు అధికారులు ఆయ‌న్ను గుంటూరు జీజీహెచ్‌కు త‌ర‌లించారు. 

కాగా, అరెస్టైన స‌మ‌యంలోనే సురేశ్ భుజం నొప్పి ఉన్న‌ట్లు జైలు అధికారుల‌తో చెప్పారు. ఇక చంద్ర‌బాబు ఇంటిపై దాడితో పాటు మ‌రియ‌మ్మ అనే మ‌హిళ హ‌త్య కేసులో ఆయ‌న నిందితుడిగా ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించ‌డంతో గుంటూరు జైలుకు ఆయ‌న్ను త‌ర‌లించ‌డం జ‌రిగింది. అక్క‌డ అనారోగ్యానికి గురి కావడంతో వైద్య‌ప‌రీక్ష‌ల కోసం గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.


More Telugu News