ఉద్యోగులకు 'మీషో' బంపర్ ఆఫర్
- సిబ్బందికి రెస్ట్ ఆన్ రీచార్జ్ బ్రేక్ ప్రకటించిన మీషో
- తొమ్మిది రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు
- కొత్త ఏడాదికి సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకే ఈ బ్రేక్ అని మీషో ప్రకటన
తమ సంస్థ ఉద్యోగులకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం మీషో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తమ సిబ్బంది రెస్ట్ తీసుకుని రీ చార్జ్ అయ్యేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాది ఈ తరహా బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పింది. తొమ్మిది రోజుల పాటు ల్యాప్ ట్యాప్స్ ఉండవు, ఈ మెయిల్స్ రావు, స్టాండప్ కాల్స్ ఉండవు, ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదని పేర్కొంది.
ఈ రెస్ట్ అండ్ రీఛార్జి బ్రేక్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వ తేదీ వరకూ ఉండనుంది. మెగా బ్లాక్ బస్టర్ సేల్ తర్వాత పూర్తి విశ్రాంతి తీసుకొని, కొత్త ఏడాది సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకు ఈ బ్రేక్ అని మీషో సంస్థ తెలిపింది. ఈ మీషో ప్రకటనకు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విధానం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందంటూ ప్రశంసించారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి మీషో సంస్థ ఎంత విలువ ఇస్తుందో దీనిని బట్టే తెలుస్తోందని మరి కొందరు కామెంట్లు పెట్టారు.