టెన్నిస్ లో రఫెల్ శకం ముగిసింది!
- కీలక నిర్ణయాన్ని ప్రకటించిన రఫెల్ నాదల్
- ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించిన నాదల్
- నవంబర్ నెలలో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత బైబై
ప్రొఫెషనల్ టెన్నిస్ దిగ్గజ ప్లేయర్ రఫెల్ నాదల్ కీలక నిర్ణయాన్ని ప్రకటించాడు. తన కెరీర్‌కు రిటైర్మెంట్ వెల్లడించాడు. నవంబర్ నెలలో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత క్రీడకు వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. గత కొంత కాలంగా గాయాలతో ఇబ్బంది పడుతున్న నాదల్.. గత నెలలో జరిగిన లేవర్ కప్ నుంచి తప్పుకొన్నాడు.
38 ఏళ్ల నాదల్ చివరిగా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాడు. సింగిల్స్‌లో రెండో రౌండ్లోనే జకోవిచ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. డబుల్స్‌లో అల్కరాస్‌తో కలిసి క్వార్టర్స్ వరకూ వెళ్లాడు. ఈ నేపథ్యంలో తాను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు నాదల్ ప్రకటించారు. గత రెండేళ్లు కఠినంగా గడిచాయన్నారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టిందని తెలిపాడు. జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు అనేది ఉంటుందని నాదల్ పేర్కొన్నాడు.
1986 జూన్ 3 న స్పెయిన్‌లో జన్మించిన నాదల్ 'క్లే కోర్టు' రారాజుగా వెలుగొందాడు. 2001లో ఇంటర్నేషనల్ టెన్నీస్‌లోకి ప్రవేశించాడు. కేవలం నాలుగు సంవత్సరాలకే తొలి టైటిల్ (2005 – ఫ్రెంచ్ ఓపెన్) ను తన ఖాతాలో వేసుకొని క్రీడా లోకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నాదల్ తన కేరీర్‌లో ఇప్పటి వరకూ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నాడు. ఇందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉండటం గమనార్హం.