లాభాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
- 144 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 25,000 పాయింట్లకు చేరువలో ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం లాభాల్లో ముగిసింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ మున్ముందు వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తుందనే అంచనాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఉన్న పాజిటివ్ సంకేతాలు మార్కెట్‌పై మన మార్కెట్ పై సానుకూల ప్రభావం చూపాయి. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ ఈరోజు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలు బాగుంటాయనే అంచనాలు కొనుగోళ్లకు మద్దతిచ్చాయి.
ఇవాళ్టి ట్రేడింగ్ లో... సెన్సెక్స్ 144 పాయింట్లు లాభపడి 81,611, నిఫ్టీ 16 పాయింట్లు లాభపడి 24,998 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ స్టాక్స్ అదరగొట్టాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు 523 పాయింట్లు లాభపడి 51,530 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్-30 విభాగంలో... కొటక్ మహీంద్రా బ్యాంకు, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, పవర్ గ్రిడ్, ఇండస్ ఇండ్ బ్యాంకు, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా స్టీల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టైటాన్, విప్రో, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, టీసీఎస్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ టాప్ లూజర్లుగా నిలిచాయి.
స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్ మిశ్రమంగా ముగిశాయి. రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, ఫిన్ సర్వీస్, మెటల్, ఎనర్జీ, ప్రైవేటు బ్యాంకు, కమోడిటీలు ఎక్కువగా లాభపడ్డాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంకులు, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, మీడియా అత్యధికంగా పతనమయ్యాయి.