ఉద్యమకారులపైకి తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడుతారా?: వినోద్ కుమార్
- తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్న వినోద్ కుమార్
- తాను మొదటి నుంచీ ఉద్యమంలో ఉన్నానని వ్యాఖ్య
- పదేళ్ల పాటు తాము ఉద్యోగాలు ఇచ్చి కూడా ప్రచారం చేసుకోలేదన్న బీఆర్ఎస్ నేత
తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారుల పైకి తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడితే ఎలా? అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... తాను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదన్నారు. తన చరిత్ర అందరికీ తెలుసునన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే కేసీఆర్ తనకు ఉద్యోగం ఇచ్చారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో తాను మొదటి నుంచి ఉన్నానని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఎంపీగా రాజీనామా చేసి గెలిచానని పేర్కొన్నారు. తెలంగాణ కోసం 32 పార్టీలను ఒప్పించేందుకు కేసీఆర్‌తో పాటు కలిసి తాను ప్రయత్నించానని వెల్లడించారు. ప్లానింగ్ బోర్డు చైర్మన్‌గా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడినట్లు చెప్పారు. సీఎం తన గురించి హేళనగా మాట్లాడినందువల్లే తాను స్పందిస్తున్నానన్నారు.
పదేళ్ల పాటు కేసీఆర్ ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ తాము ఇంతలా ప్రచారం చేసుకోలేదని కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తాము ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నియామక పత్రాలు పోస్టాఫీస్ ద్వారా వెళ్లేవని, కానీ ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు తామే ఉద్యోగాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాక ప్రచారం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొరివిదెయ్యం అనడం సరికాదన్నారు.