భార‌త క్రికెట‌ర్ల‌కు ర‌త‌న్ టాటా సాయం... ఫరూఖ్ ఇంజనీర్ నుంచి యువీ, శార్దూల్ ఠాకూర్ వ‌ర‌కు ఎంద‌రికో ప్రోత్సాహం!

  • పక్కా క్రీడాభిమానిగా గుర్తింపు పొందిన టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా
  • క్రికెట్ అంటే అమిత‌మైన‌ ఇష్టం
  • ఆ ఇష్టంతోనే కొంద‌రు భార‌త‌ క్రికెట‌ర్ల‌కు అండ‌గా నిలిచిన పారిశ్రామిక దిగ్గ‌జం
పారిశ్రామిక దిగ్గ‌జం, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు క్రీడలంటే మ‌క్కువ‌. అందులోనూ క్రికెట్ అంటే ఆయనకు అమిత‌మైన‌ ఇష్టం. ఆ ఇష్టంతోనే కొంద‌రు క్రికెట‌ర్ల‌కు ఆయ‌న అండ‌గా నిలిచారు. భారత క్రికెట్‌లో అనేక మంది ఆటగాళ్లకు టాటా గ్రూప్ మద్దతుగా నిలిచింది. క్రికెట్‌లో వారి కెరీర్‌కు టాటా ట్ర‌స్టు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ వ‌స్తోంది. 

అలాగే టాటా గ్రూప్‌లోని పలు కంపెనీలు మన క్రికెటర్లకు ఉద్యోగావకాశాలు కల్పించాయి. అలాగే వారి ప్రొఫెషనల్ కెరీర్‌కు ఆర్థికంగానూ టాటా గ్రూప్ కంపెనీలు మద్దతుగా నిలిచాయి. అలా టాటా గ్రూప్ నుంచి సాయం పొందిన‌ పలువురు క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. భార‌త జ‌ట్టుకు ఎన్నో విజ‌యాలు అందించారు.

ఈ క్రికెట‌ర్ల‌కు ర‌త‌న్ టాటానే స్పాన్స‌ర్‌

మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజనీర్‌కు టాటా మోటార్స్ తోడ్పాటు అందించింది. అలాగే సంజయ్ మంజ్రేకర్, అజిత్ అగార్కర్, శ్రీనాథ్, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్, రాబిన్ ఉతప్ప, కైఫ్‌కు టాటా ట్ర‌స్టు ఆర్థికంగా అండ‌గా నిలిచింది. 

అలాగే తమ గ్రూప్‌లో ఉద్యోగావ‌కాశాలు కూడా కల్పించింది. వీరితో పాటు శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్ కూడా టాటా గ్రూప్‌ నుంచి సాయం పొందారు. టాటా స్టీల్స్, టాటా పవర్స్, ఎయిర్‌వేస్ విభాగాల్లో టాటా గ్రూప్ ఆయా క్రికెటర్లకు ఉద్యోగాలు కల్పించింది. దీంతోపాటు వారికి స్పాన్సర్‌ చేస్తూ అండ‌గా ఉండి ప్రోత్స‌హించింది.


More Telugu News