రతన్ టాటా జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఇవిగో

  • డిసెంబర్ 28, 1937న ముంబ‌యిలో రతన్ టాటా జననం
  • తల్లిదండ్రులు విడిపోవడంతో అమ్మమ్మ దగ్గర పెరిగిన వ్యాపార దిగ్గజం
  • నాలుగు సందర్భాల్లో పెళ్లికి దగ్గరగా వెళ్లినప్పటికీ చేసుకోని వైనం
  • 1991 నుంచి 2012 వరకు టాటా గ్రూప్ చైర్మన్‌గా వ్యవహరించిన రతన్ టాటా
విలువలతో కూడిన వ్యాపారానికి చిరునామాగా మారిన భారత పారిశ్రామిక దిగ్గజం, ప్రపంచం మెచ్చిన పారిశ్రామిక దిగ్గజం, దాతృత్వానికి మారుపేరు అయిన టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్‌ టాటా ఇకలేరనే విషయం తెలిసిందే. బుధవారం రాత్రి ముంబ‌యిలోని బ్రీచ్ క్యాండీ ఆసుప‌త్రిలో ఆయన కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించిన 10 ఆసక్తికరమైన విషయాలను మననం చేసుకుందాం..

1. టాటా గ్రూప్‌ను స్థాపించిన జమ్‌షెడ్‌జీ టాటా మునిమనవడే రతన్ నావల్ టాటా. డిసెంబర్ 28, 1937న ఆయన జన్మించారు. ముంబ‌యిలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు.

2. 1948లో రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సోనీ టాటా విడిపోయారు. దీంతో తన అమ్మమ్మ నవాజ్‌బాయి టాటా వద్ద రతన్ టాటా పెరిగారు.

3. రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. నాలుగు సందర్భాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెళ్లికి దగ్గరగా వెళ్లారు కానీ చేసుకోలేదు. 

4. లాస్ ఏంజెల్స్‌లో పనిచేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డానని రతన్ టాటా ఒక సందర్భంలో అంగీకరించారు. కానీ 1962 ఇండో-చైనా యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను భారత్ పంపించడానికి నిరాకరించారట.

5. 
1961లో రతన్ టాటా కెరియర్ ప్రారంభించారు. టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో కార్యకలాపాలను మొదలుపెట్టారు. ఈ అనుభవం ఆయనను భవిష్యత్ నాయకుడిగా తీర్చిదిద్దింది.

6. 
తన ముత్తాత స్థాపించిన టాటా గ్రూప్ చైర్మన్‌గా 1991లో బాధ్యతలు స్వీకరించారు. 2012 వరకు గ్రూపును నడిపించారు.

7. భారత ఆర్థిక వ్యవస్థ సరళీకరణ సమయంలో టాటా గ్రూపును ఆయన పునర్వ్యవస్థీకరించడం మొదలుపెట్టారు. టాటా నానో, టాటా ఇండికా సహా ప్రముఖ కార్లను కంపెనీ ఉత్పత్తి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

8. 
టెట్లీని దక్కించుకునేందుకు టాటా టీని, జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ కోసం టాటా మోటార్స్‌ను, కోరస్‌ కోసం టాటా స్టీల్‌ను రతన్ టాటా కొనుగోలు చేశారు.

9. 
ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారును మధ్యతరగతి వారికి అందుబాటులోకి తీసుకొస్తానని 2009లో రతన్ టాటా మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చుకున్నారు. టాటా నానో కారును రూ.1 లక్ష ధరకు మార్కెట్‌లో ఆవిష్కరించారు. సరసమైన ధరకు చిహ్నంగా ఈ కారు నిలిచింది.

10. 
పదవీవిరమణ తర్వాత టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్‌కు ‘గౌరవ చైర్మన్’ బిరుదును అందించారు.


More Telugu News