కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
- డేవిడ్ బెకర్, డెమిస్ హస్సాబిస్, జాన్ ఎమ్ జంపర్‌కు కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి
- ప్రొటీన్ల డిజైన్లపై పరిశోధనలకుగాను ప్రతిష్ఠాత్మక పురస్కారం
- ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటన
ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ముగ్గురు శాస్త్రవేత్తలు ఎంపికయ్యారు. ప్రొటీన్ల డిజైన్లపై పరిశోధనలకు సంబంధించి కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు డెమిస్ హసబిస్, జాన్ ఎం. జంపర్, డేవిడ్ బెకర్‌ను నోబెల్ బహుమతి వరించింది. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్‌కుగాను డెమిస్, జంపర్.. కంప్యుటేషనల్ ప్రొటీన్ డిజైన్‌కుగాను బెకర్ ఈ పురస్కారం గెలుచుకున్నారు.
ఇక గతేడాది కూడా ముగ్గురు రసాయన శాస్త్రవేత్తలు ఈ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. నానో టెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ, అభివృద్ధికిగాను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మౌంగి బవెండి (62), లూయిస్ బ్రూస్ (80), అలెక్సీ ఎకిమోవ్ (78) నోబెల్ బహుమతి గెలుచుకున్నారు.