ఓటీటీలో సుహాసిని వెబ్ సిరీస్!

  • మలయాళంలో రూపొందిన 'జై మహేంద్రన్'
  • పొలిటికల్ కామెడీ డ్రామా నేపథ్యంలో సాగే కథ
  • కీలకమైన పాత్రలో సుహాసిని 
  • ఈ నెల 11 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్

'సోనీ లివ్' ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి ఇప్పుడు 'జై మహేంద్రన్' వెబ్ సిరీస్ రెడీ అవుతోంది. శ్రీకాంత్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ సిరీస్ లో సైజూ కురుప్ - సుహాసిని ప్రధానమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సిరీస్ ను ఈ నెల 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.

ఇది పొలిటికల్ కామెడీ డ్రామా నేపథ్యంలో సాగే కథ. సురేశ్ కృష్ణ .. మణియన్ పిళ్లై .. విష్ణు గోవిందన్ .. సిద్ధార్థ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. మార్చిలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. 

ఈ కథలో కథానాయకుడు ఒక అవినీతిపరుడైన ప్రభుత్వ అధికారి. తన చుట్టూ ఉన్న అన్ని రకాల అవకాశాలను తాను ఎదగడానికి ఉపయోగించుకుంటూ ఉంటాడు. మరికొందరు అవినీతిపరులు ఆయనకీ సహకరిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో తన అవినీతి బయటపడిన కారణంగా అతను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయబడతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ. 


More Telugu News