ఒమర్ అబ్దుల్లాకు కేటీఆర్ శుభాకాంక్షలు
- జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ఒమర్ అబ్దుల్లాకు కేటీఆర్ విషెస్
- ఎంతో అద్భుతమైన పునరాగమనం అంటూ కొనియాడిన కేటీఆర్
- జమ్మూకశ్మీర్ సీఎంగా బాధ్యతలు చేపట్టునున్న ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అద్భుత విజయం సొంతం చేసుకున్న ఒమర్ అబ్దుల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. భారీ విజయంతో మళ్లీ జమ్మూకశ్మీర్‌లో పునరాగమనం చేయడం అద్భుతమని కొనియాడారు. భారత్‌లోని అత్యంత అందమైన రాష్ట్రానికి పరిపాలన అందించనున్న మీకు మరోసారి శుభాకాంక్షలు అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాగా, జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు చేపడుతారని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పదేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్ ప్రజలు ఇండియా కూటమికి 90 స్థానాలకు గానూ 49 స్థానాల్లో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. మొదటిసారి ఒంటరిగా అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ 29 సీట్లకే పరిమితమైంది.
అలాగే ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ సత్తా చాటింది. ఆ పార్టీ ఏకంగా 42 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌కు మాత్రం చేదు ఫలితాలే వచ్చాయి. నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కేవలం 6 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది.