రెపో రేటుపై ఆర్బీఐ కీలక నిర్ణయం

  • వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ భేటీలో నిర్ణయం
  • ద్రవ్యోల్బణం కట్టడి దృష్ట్యా నిర్ణయం
  • ముగిసిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ
కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. బుధవారంతో ముగిసిన మూడు రోజుల ‘ద్రవ్య విధాన కమిటీ భేటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలంటూ ఆరుగురిలో ఐదుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారని ఆయన చెప్పారు.

ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఇక ఎస్‌డీఎఫ్ (సస్టెయినబుల్ డిపాజిట్ ఫెసిలిటీ) రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ (మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ) రేటు, సేవింగ్స్ రేటు 6.75 శాతంగా ఉన్నాయని ఆయన వివరించారు.


More Telugu News