ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. భారత్ ఫైనల్ చేరితే వేదిక మారే చాన్స్: ‘టెలిగ్రాఫ్’
- ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫీ
- ట్రోఫీకి లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలను ఎంపిక చేసిన పీసీబీ
- లాహోర్‌లో ఫైనల్ మ్యాచ్
- భారత్ ఫైనల్ చేరితే వేదిక దుబాయ్‌కి మార్చవచ్చన్న ‘టెలిగ్రాఫ్’
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దాయాది పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, బీసీసీఐ మాత్రం భారత జట్టును ఆ దేశానికి పంపించేందుకు ససేమిరా అంటోంది. తటస్థ వేదికలో తమ మ్యాచులను నిర్వహించాలని పట్టుబడుతోంది. మరోవైపు పాక్ కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈసారి కచ్చితంగా టీమిండియా తమ దేశానికి రావాల్సిందేనని అంటోంది. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దశాబ్దానికి పైగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడలేదు. అంతర్జాతీయ టోర్నీల సమయంలో మాత్రమే రెండు జట్లు తలపడుతున్నాయి. అది కూడా తటస్థ వేదికల్లోనే. పాక్ జట్టు మన దేశంలో ఆడేందుకు వస్తోంది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ కోసం ఆ జట్టు మన దేశంలో పర్యటించింది.
చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్ ఇప్పటికే టోర్నమెంట్ షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. దీనిలో భాగంగా ఫైనల్ మ్యాచ్‌కు లాహోర్‌ను వేదికగా నిర్ణయించింది. అయితే, ‘టెలిగ్రాఫ్’ నివేదిక ప్రకారం.. ఒకవేళ ఈ ట్రోఫీ ఫైనల్‌కు టీమిండియా అర్హత సాధిస్తే వేదిక దుబాయ్‌కి మారే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌కు వెళ్లకూడదని భారత జట్టు నిర్ణయించుకుంటే టీమిండియా మ్యాచులన్నీ యూఏఈలో నిర్వహించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే, టోర్నీ పూర్తిగా పాకిస్థాన్‌లోనే జరుగుతుందని గత కొన్ని వారాలుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చెబుతోంది.
2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్‌లో విజయవంతంగా నిర్వహిస్తామని, భారత్‌తో సహా పాల్గొనే అన్ని జట్లూ టోర్నమెంట్‌లో పాల్గొంటాయని పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి లాహోర్, కరాచీ, రావల్పిండి వేదికలను పీసీబీ ఎంపిక చేసింది. ఆయా స్టేడియాలకు మరిన్ని సౌకర్యాలను జోడిస్తూ తుది మెరుగులు దిద్దుతున్నట్టు నఖ్వీ తెలిపారు.
లాహోర్‌లో నఖ్వీ మాట్లాడుతూ, భారత్ భాగస్వామ్యంపై కొనసాగుతున్న అనిశ్చితిని ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2008 జులై నుంచి భారత్ పాకిస్థాన్‌లో పర్యటించలేదని తెలిపారు.
"భారత జట్టు పాకిస్థాన్‌కు రావాలి. వారు ఇక్కడికి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో ఇది జరుగుతుందని అనుకుంటున్నాను. పాకిస్థాన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లకు మేము ఆతిథ్యం ఇస్తామని విశ్వసిస్తున్నాను" అని పేర్కొన్నారు. టోర్నీ షెడ్యూల్ సమయానికి స్టేడియాలన్నీ సిద్ధంగా ఉంటాయని తెలిపారు. టోర్నమెంట్‌కు ముందే ఏవైనా మరమ్మతులు ఉంటే పూర్తి చేస్తామని వివరించారు.