నస్రల్లాను మించిన నయీమ్ ఖాసిమ్... ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు
- ఇజ్రాయెల్ దాడిలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా కీలక కమాండర్లు హతం
- సంస్థ పగ్గాలు చేపట్టిన డిప్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీమ్
- ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ వీడియో సందేశం విడుదల
ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా సహా పలువురు కీలక కమాండర్లు హతమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ హిజ్బూల్లా తమ శక్తి సామర్థ్యాలపై ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా ఆ సంస్థ డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న నయీమ్ ఖాసిమ్ ఇజ్రాయెల్‌ను హెచ్చరిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని, వారంతా నిరాశ్రయులు కావడం తప్పదని హెచ్చరించాడు.
అగ్రనేతల మృతితో హిజ్బుల్లా నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆ సంస్థ తరపున ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖాసిమ్ ఎవరనే చర్చ జరుగుతోంది. మిలిటెంట్ గ్రూపుల్లో ఒకటైన షియా రాజకీయ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో హసన్ నస్రల్లా మాదిరిగానే నయీమ్ ఖాసిమ్ ఒకరు. అయితే, నస్రల్లా అంతటి చరిష్మా, వాగ్దాటి ఆయనకు లేవు. తెలుపు రంగు తలపాగా చుట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తుంటాడు. ఇంతకు ముందు నస్రల్లా అజ్ఞాతంలోకి వెళ్లిన సందర్భంలోనూ సభలు, ఇంటర్వ్యూలతో పాటు ఇతర బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
నస్రల్లా కంటే ఖాసిమ్ తీవ్ర భావజాలం కలిగిన వ్యక్తి అని, ఆయన బహిరంగ ప్రకటనలు చూస్తే అర్థమవుతుందని ఆ సంస్థ కార్యకలాపాలపై పరిశోధనలు చేసే కార్నెగీ మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధి మొహనద్ అలీ చెప్పుకొచ్చారు. నస్రల్లా మృతి తర్వాత ఆయన దగ్గరి బంధువు హషేమ్ సఫీద్దీన్ ఆ బాధ్యతలు చేపడతారని భావించారు. కానీ, నస్రల్లా మరణం తర్వాత ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఖాసిమ్‌కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరో పక్క హిజ్బూల్లాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్న అమెరికా ఖాసిమ్ పైనా ఆంక్షలు విధించింది.
ఖాసిమ్ దక్షిణ లెబనాన్ లోని కఫర్ ఫిలాలో జన్మించాడు. స్థానిక యూనివర్సిటీలో చదువు పూర్తి చేసిన అనంతరం రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. మతపరమైన విద్యను అభ్యసించిన ఖాసిమ్ .. విద్యార్ధులకూ బోధించే వాడు. ఇందుకోసం ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. 1970లో షియా వర్గానికి మద్దతుగా జరిగిన ఉద్యమంలో మిలిటెంట్ సంస్థ తరపున చేరాడు. 1982లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దురాక్రమణ సమయంలో ఏర్పడిన హిజ్బూల్లాలో చేరాడు. 1991 నుంచి ఆ సంస్థకు డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు.