మొదటి పెళ్లి తరువాత నాన్న కట్టుబట్టలతో రోడ్డుపైకి వచ్చారు: నటుడు రామకృష్ణ తనయుడు శ్రీను
- నాన్న మొదటి పెళ్లి జరిగింది పార్వతిగారితో
- ఆమె కూడా నటి అనే నేను విన్నాను
- ఆ తరువాత వాళ్లిద్దరూ విడిపోయారు
- ఆమెకి అన్యాయం జరిగిందనేది అవాస్తవమన్న శ్రీను
శోభన్ బాబు .. కృష్ణ .. కృష్ణంరాజు వంటి హీరోలు బరిలో ఉండగా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హ్యాండ్సమ్ హీరోగా రామకృష్ణ కనిపిస్తారు. అప్పట్లో ఆయన నటి గీతాంజలిని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆయనకి ఒక పెళ్లి అయిందనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని గురించి రామకృష్ణ - గీతాంజలి తనయుడు శ్రీను, తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
" మా నాన్నగారి మొదటి భార్య 'భీమవరం'లో ఉన్నారనే ప్రచారం ఉంది. కానీ అందులో నిజం లేదు. చెన్నై వచ్చిన తరువాత .. నటుడిగా ఆయన ప్రయాణం మొదలైన తరువాత ఆయనకి 'పార్వతి' అనే ఒక నటితో పరిచయమైందట. ఆమె ఒక నటి అని విన్నాను. ఆమెను నాన్నగారు వివాహం చేసుకున్నారనేది నిజం. ఇద్దరూ కలిసే ఉండేవారు" అని అన్నారు.
"కొంతకాలం తరువాత నాన్నగారికి .. ఆమెకి కుదరక పోవడం వలన విడిపోయారు. అప్పుడు నాన్న తాను కొన్న ఇంటిని ఆమెకే ఇచ్చేసి కట్టుబట్టలతో బయటికి వచ్చేశారు. అప్పటి నుంచి లైఫ్ ను మళ్లీ కొత్తగా స్టార్ట్ చేశారు. మొదటి భార్యకి నాన్నగారు అన్యాయం చేశారనేది అవాస్తవం. నాన్నగారు ఇచ్చిన ఇంటిపై ఆమెకు రెంట్లు వచ్చేవి. ఆమె ఉన్నంతవరకూ ఆమె లైఫ్ హ్యాపీగానే వెళ్లిపోయింది. పార్వతిగారికి పిల్లలు లేరు. ఆ తరువాత ఆమె ఆ ఇంటిని తన బంధువులకు ఇచ్చేశారు" అని చెప్పారు.