హర్యానా, జమ్మూకశ్మీర్ ఫలితాలపై హరీశ్ రావు ఏమన్నారంటే...?

  • జాతీయ పార్టీలను ప్రజలు నమ్మలేదన్న హరీశ్
  • కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని వ్యాఖ్య
  • దృష్టి మళ్లింపు రాజకీయాలను మానుకోవాలని రేవంత్ కు సూచన
హర్యానా ఎన్నికల్లో బీజేపీ, జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలుపు దిశగా వెళుతున్నాయి. ఈ ఫలితాలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందని ఆయన అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు నమ్మలేదని హరీశ్ చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు గమనించారని అన్నారు. ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించిందని చెప్పారు. ఈ ఫలితాలను చూసిన తర్వాతైనా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి మళ్లింపు రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలను మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హితవు పలికారు. జమ్మూకశ్మీర్ లో బీజేపీని అక్కడి ప్రజలు విశ్వసించలేదని చెప్పారు.


More Telugu News