షూటింగ్ లో గాయపడ్డ బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి

  • అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న 'గూఢచారి 2'
  • ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఇమ్రాన్ హష్మి
  • హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్
బాలీవుడ్ రొమాంటిక్ హీరోగా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మి గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఇమ్రాన్ హష్మి ప్రస్తుతం 'గూఢచారి 2' చిత్రంలో నటిస్తున్నాడు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. షూటింగ్ సెట్ లో ఒక యాక్షన్ సీన్ లో ఒక చోట నుంచి మరొక చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలింది. మెడపై కట్ అయి రక్తం వచ్చింది. ఈ యాక్షన్ సీన్ ను ఇమ్రాన్ హష్మి స్వయంగా డిజైన్ చేసుకున్నట్టు సమాచారం. ఇమ్రాన్ గాయపడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'గూఢచారి 2' సినిమాలో ఇమ్రాన్ హష్మి కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఇంకోవైపు, పవన్ కల్యాణ్ 'ఓజీ' చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.


More Telugu News