శ్రీమహాలక్ష్మి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి

  • ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  • భక్తుల సందోహంతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి
  • శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకుని తరిస్తున్న భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజైన నిజ ఆశ్వయుజ సుద్ధ షష్ఠి (మంగళవారం) నాడు కనకదుర్గమ్మ శ్రీమహాలక్ష్మిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే .. విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతుంటారు. ఈ రోజు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని మంత్రం చదివినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. 
 
కాగా, రేపు (బుధవారం) అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేని విధంగా చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. మూలానక్షత్రం రోజు (అక్టోబర్ 9)న లక్షన్నర నుండి రెండు లక్షల వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టారు.


More Telugu News