బుమ్రా వర్సెస్ షాహీన్ అఫ్రిది.. ఇద్దరిలో ఎవరు బెస్ట్.. గణాంకాలు ఇవిగో!

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, పాకిస్థాన్ స్పీడ్ స్టార్ షాహీన్ అఫ్రిది ఇద్దరూ ఆధునిక క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లు. మూడు ఫార్మాట్లలోనూ తమ తమ దేశాలకు మ్యాచ్ విన్నర్లుగా చాలా సార్లు నిరూపించుకున్నారు.

వికెట్లు అవసరమైనప్పుడు బంతిని బుమ్రా చేతికి అందిస్తే చాలు అని కెప్టెన్లు విశ్వాసం ఉంచుతుంటారు. ఎలాంటి ఒత్తిడి పరిస్థితిలోనైనా జట్టుకు వికెట్లు అందించడానికి అతడు సిద్ధంగా ఉంటాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌ మ్యాచే ఇందుకు చక్కటి ఉదాహరణ. దక్షిణాఫ్రికాకు చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైనప్పుడు ఏవిధంగా బౌలింగ్ చేశాడో అందరికీ తెలిసిందే.

ఇక పాకిస్థాన్‌ పేసర్ షాహీన్ అఫ్రిది 2022 టీ20 ప్రపంచ కప్‌లో బుమ్రా పాత్రనే పోషించాడు. తన జట్టు టైటిల్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 2021 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌పై పాకిస్థాన్ సాధించిన ఏకైక విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఔట్ చేసింది అతడే. కేఎల్ రాహుల్‌ను కూడా పెవీలియన్‌కు పంపించాడు. మొత్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా అఫ్రిది నిలిచాడు.

ఇవన్నీ ఇప్పుడెందుకు గుర్తుచేసుకోవాల్సి వచ్చిందంటే, దాయాది దేశాలకు చెందిన ఈ స్టార్ పేసర్లు ఇద్దరూ టీ20 ఫార్మాట్‌లో 70 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల టీ20 కెరీర్‌లో బుమ్రా 89 వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది 100 వికెట్ల మైలురాయికి చేరువయ్యాడు. అయితే షాహీన్ కంటే బుమ్రా సగటు, ఎకానమీ మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌లో ఇద్దరి గణాంకాలను ఒకసారి గమనిద్దాం..

బుమ్రా 89 వికెట్లు, సగటు 17.74, ఎకానమీ 6.27, స్ట్రైక్ రేట్ 16.95గా ఉన్నాయి. ఇక షాహీన్ అఫ్రిది మొత్తం 98 వికెట్లు పడగొట్టగా. సగటు 20.39, ఎకానమీ 7.65, స్ట్రైక్ రేట్ 15.95గా ఉన్నాయి.


More Telugu News