మహేష్‌బాబు పంపించిన ఆ మేసేజ్ నాలో ఆనందాన్ని కలిగించింది
- తండ్రి, కొడుకుల ఎమోషన్ ఎవర్‌గ్రీన్ అంటున్న సుధీర్‌బాబు
- ఇద్దరు ఫాదర్స్, సన్ మధ్య జరిగే ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఇది
- మహేష్‌కు ట్రైలర్ నచ్చడంతో ఖుషీ అవుతున్న సుధీర్
సినిమాల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్‌గా వుండే హీరోల్లో సుధీర్‌బాబు ఒకరు. ఇటీవల హరోం హర అంటూ ఓ మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన నటించిన తాజా చిత్రం 'మా నాన్న సూపర్‌హీరో'. తండ్రి కొడుకుల అనుబంధంతో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సుధీరబాబు ఈ చిత్రం విశేషాల గురించి పాత్రికేయులతో మాట్లాడారు.
''ఇద్దరు తండ్రులు- ఒక కొడుకు చుట్టూ తిరిగే కథ ఇది. తండ్రిని చూసుకోవడానికి కొడుకు పడే తపనలో చాలా కొత్త సన్నివేశాలు వుంటాయి. అవి ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. ఇప్పటి వరకు ఈ సెంటిమెంట్‌పై ఎన్ని సినిమాలు వచ్చినా ఇంకా చెప్పని ఎమోషన్ కూడా ఇందులో వుంటుంది. ఇది ఇద్దరు ఫాదర్స్, ఒక కొడుకు మధ్య నడిచే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు.
ఇది యూనివర్సల్ పాయింట్. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ చిత్రం ట్రైలర్‌లోనే కథ మొత్తం చెప్పేశాం. ఎందుకంటే ఇది థ్రిల్లర్ కథాంశం కాదు. ఇది హ్యుమన్ రిలేషన్‌పై అల్లుకున్న కథ. ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో పూర్తి క్లారిటి వుండాలని ట్రైలర్‌లో అన్ని చెప్పేశాం' అన్నారు.
మా నాన్న సూపర్‌హీరో ట్రైలర్ చూసిన హీరో మహేష్‌బాబు స్పందన గురించి సుధీర్ చెబుతూ ''మహేష్‌కు ట్రయిలర్ రఫ్ కట్ పంపించాం. చూసి లుకింగ్ గుడ్ అన్నారు. ఫైనల్ ట్రైలర్ పంపించిన తర్వాత.. చూసి చాలా అప్రిషియేట్ చేశారు. మనసుకు హత్తుకుంది అన్నారు. లాస్ట్ లో వచ్చే 'మహేష్ బాబు పేరు' ఉన్న డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ చాలా ఫన్నీగా వుందని అన్నారు. సాధారణంగా అయితే మహేష్ నా దగ్గర ఏది కూడా ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ చేయడు. ఆయన ఈ ట్రైలర్ గురించి ప్రశంసించడం... మేసేజ్‌లో పెట్టిన కొన్ని అక్షరాలు.. సింబల్స్ నాకు చాలా సంతోషనిచ్చాయి' అని తెలిపారు.