వైద్య రంగంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్

  • నోబెల్ విజేతలుగా విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్ కున్
  • జన్యు క్రమబద్ధీకరణలో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశదీకరించిన సైంటిస్టులు
  • నోబెల్ ప్రైజ్ కింద రూ.9.23 కోట్ల నగదు బహుమతి
అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్ కున్ ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. జన్యు క్రమబద్ధీకరణలో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను అత్యంత విపులమైన రీతిలో ఆవిష్కరించినందుకు గాను వారు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. 

విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్ కున్ తమ పరిశోధనల ద్వారా జన్యు క్రియాశీలత ఎలా క్రమబద్ధీకరించబడుతుందో చెప్పే ఒక ప్రాథమిక సిద్ధాంతానికి రూపం కల్పించారు. 

కాగా, నోబెల్ పురస్కారం కింద వీరిద్దరికీ రూ.9.23 కోట్ల నగదు బహుమతి అందించనున్నారు. 

విక్టర్ ఆంబ్రోస్ ప్రస్తుతం మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ యూనివర్సిటీలో లో నేచురల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. గ్యారీ రువ్ కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో జెనెటిక్స్ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు.


More Telugu News