ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ఏడాది.. ఆరోజు నాపై 12 రౌండ్లు కాల్చారు.. గుర్తుచేసుకున్న సైనికురాలు
- తమ భయంకర అనుభవాలను పంచుకున్న ఇజ్రాయెల్ సైనికులు
- ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ
- ఏడాదైనా ఆ గాయాలు మానలేదని ఆవేదన
ఇజ్రయెల్‌పై హమాస్ రాకెట్ల వర్షం కురిపించి నేటికి ఏడాది. గాజా స్ట్రిప్ నుంచి ఒకేసారి 5 వేల రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్‌ను ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా చేసింది.. ఈ దాడిలో వందలాదిమంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న శత్రుత్వం ఈ దాడితో యుద్ధంగా మారింది. హమాస్‌పై ప్రతీకార దాడి మొదలుపెట్టిన ఇజ్రాయెల్ ఏడాది కాలంగా యుద్ధం చేస్తూనే ఉంది. ఇప్పుడీ యుద్ధం ఇటు లెబనాన్‌కు, ఇరాన్‌కు, సిరియాకు కూడా పాకింది. తమపై హమాస్ దాడిచేసి ఏడాది అయిన సందర్శంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) హృదయాన్ని కదిలించే తమ సైనికులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, స్థానికుల అనుభవాలను నెవర్ ఫర్‌గెట్ హ్యాష్‌టాగ్‌తో షేర్ చేసింది.
నాపై 12సార్లు కాల్చారు
నాటి భయంకర ఘటనను ఆర్మీ మహిళా అధికారి ఒకరు గుర్తుచేసుకున్నారు. విధుల్లో ఉన్న తనపై ముష్కరులు 12సార్లు కాల్చారని పేర్కొన్నారు. తన కాళ్లు, తొడలు, చేతులు, భుజాలపై తూటాల వర్షం కురిపించారని పేర్కొన్నారు. ‘‘ఆ రోజు మేం ఆరుగురుం ఉన్నాం. మేం తిరిగి వారిపై దాడికి ప్రయత్నించాం. మేమున్న గదిపై వారు గ్రనేడ్లు విసిరారు. లోపలికొచ్చి మాపై కాల్పులు జరిపారు’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు.
నా చుట్టూ శవాలే
మరో సైనికుడు మాట్లాడుతూ.. ‘‘గాయపడిన ప్రజలు ఆసుపత్రికి వస్తూనే ఉన్నారు. అయితే, వస్తున్నవి శవాలు మాత్రమే. కేవలం శవాలు మాత్రమే. వారు నా సమీపంలోనే చనిపోయారు. అక్టోబర్ 7న అలీనా చనిపోయింది. ఆమె నా గాళ్‌ఫ్రెండ్’’ అని గుర్తుచేసుకున్నాడు.
గేటు వద్ద ముగ్గురు చిన్నారులను చంపేశారు
మరో సోల్జర్ తన భయానక స్థితిని వివరిస్తూ.. ‘‘మేం కిబ్బుట్జ్ బీరీలోకి పరిగెత్తాం. గేటు వద్ద ముగ్గురు చిన్నారుల మృతదేహాలు కనిపించాయి. నిద్ర, నీళ్లు, ఆహారం లేకుండా మూడు రోజులు తీవ్ర పోరాటం తర్వాత కిబ్బుట్జ్ బీరీని నియంత్రించగలిగాం. మున్ముందు ఇలాంటివి జరగకుండా నిత్యం పోరాడుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నాడు.
మా కుటుంబం మొత్తాన్ని చంపేశారు
హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఓ యువతి తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది. తన కుటుంబంలోని నలుగురిని చంపేశారని, మరో ఏడుగురిని కిడ్నాప్ చేశారని గుర్తుచేసుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది. తమ కుటుంబ సభ్యులు రెండు ఇళ్లలో దాక్కున్నారని, ఉగ్రవాదులు ఒక ఇంట్లోని వారినందరినీ చంపేశారని, మరో ఇంట్లో తనను తప్ప మిగతా అందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని గుర్తుచేసుకుంది. ఏడాది అయినా, ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు వదిలి పోవడం లేదని కన్నీరు పెట్టుకుంది.