రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు

  • ఢిల్లీలో సీఎం చంద్రబాబు రెండ్రోజుల పర్యటన
  • ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు
  • కీలక అంశాలపై చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన రేపు, ఎల్లుండి దేశ రాజధానిలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులను చంద్రబాబు కలవనున్నారు. 

రేపు (అక్టోబరు 7) సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలవనున్నారు. ఎల్లుండి (అక్టోబరు 8) అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ లతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇటీవల విజయవాడ వరదల అనంతరం సీఎం చంద్రబాబు తొలిసారి ప్రధాని మోదీని కలవనున్నారు. దాంతో, వరద సాయం విడుదల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి. 

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధుల విడుదలకు ఆటంకాలు లేకుండా చూడడంపై కేంద్రం పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు.


More Telugu News