ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఓటమి ఖాయం: కేజ్రీవాల్
- ఢిల్లీలో జనతా కీ అదాలత్
- హాజరైన అరవింద్ కేజ్రీవాల్
- బీజేపీపై విమర్శనాస్త్రాలు
ఢిల్లీలో ఏర్పాటు చేసిన జనతా కీ అదాలత్ బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై ధ్వజమెత్తారు. హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని అన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక పార్టీ అని విమర్శించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని... డబుల్ ఇంజిన్ అంటే ద్రవ్యోల్బణం, అవినీతి అని వ్యాఖ్యానించారు. ఇక, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, దేశంలోని బీజేపీ కూటమి పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చితే, తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. మరి తన డిమాండ్ నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉందా? అని సవాల్ విసిరారు.