ఉద్యోగాల జాతరకు తెరలేపుతున్న ఎస్ బీఐ

  • 10 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • త్వరలో నోటిఫికేషన్
  • కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేస్తున్నామన్న ఎస్ బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఉద్యోగాల జాతరకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఎస్ బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 600 బ్రాంచిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

దీనిపై ఎస్ బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి స్పందించారు. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 22,542 ఎస్ బీఐ బ్రాంచిలు ఉన్నాయని, ఇప్పుడు మరో 600 బ్రాంచిలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

మార్చి నాటికి 2.32 లక్షల మంది సిబ్బంది పనిచేస్తున్నారని... తాజాగా మరో 10 వేల ఉద్యోగుల అవసరం ఉందని చల్లా శ్రీనివాసులు తెలిపారు.


More Telugu News