సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకి స్పెషల్ రైలు... ప్రారంభించిన కిషన్ రెడ్డి

  • వారానికి రెండు పర్యాయాలు అందుబాటులో రైలు
  • ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం
  • అటు, వాస్కోడగామా నుంచి ఉదయం 9 గంటలకు రైలు 
సికింద్రాబాద్ నుంచి గోవాకి వెళ్లే పర్యాటకులకు శుభవార్త. సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) స్పెషల్ రైలును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు ప్రారంభించారు. కిషన్ రెడ్డి ఈ రైలును సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. 

సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) రైలు బుధ, శుక్రవారాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఎక్స్ ప్రెస్ రైలు ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల, కర్నూలు, డోన్, గుంతకల్, బళ్లారి, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది.
ఇక, వాస్కోడగామా (గోవా)-సికింద్రాబాద్ రైలు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు వాస్కోడగామాలో బయల్దేరుతుంది.


More Telugu News