తిరుమలలో కన్నుల పండుగగా సింహ వాహన సేవ

  • వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • ఉదయం సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు
  • రాత్రి సర్వ భూపాల వాహనంపై మలయప్ప స్వామి అభయం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం సింహ వాహన సేవ నిర్వహించారు. సింహ వాహనంపై మలయప్ప స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవను తిలకించారు. కాగా, ఈ రోజు రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 

ఉత్సవాల్లో రెండో రోజైన శనివారం రాత్రి హంస వాహనంపై మలయప్ప స్వామి వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో టీటీడీ ధార్మిక ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు ఆధాత్మికానందాన్ని కలిగించాయి. అయిదు రాష్ట్రాలకు చెందిన కళాకారులు 18 కళాబృందాలు 511 మంది కళాకారులు ప్రదర్శనలిచ్చారు.


More Telugu News