మాజీ ప్రియుడిపై యాసిడ్ దాడి చేసిన యువతి
- బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులు తట్టుకోలేకే చేసినట్లు వెల్లడి
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన యువకుడు
- యూపీలోని అలీగఢ్ లో దారుణం
- అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో దారుణం చోటుచేసుకుంది. మాజీ ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ దాడి చేసింది. ఇద్దరూ రెస్టారెంట్ లో కలుసుకుని మాట్లాడుకుంటుండగా మాజీ ప్రియుడిపై యాసిడ్ చల్లింది. దీంతో ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో మాజీ ప్రియుడు ఆసుపత్రిలో చేరాడు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అలీగఢ్ లోని ఓ రెస్టారెంట్ కు శనివారం ఉదయమే ఓ యువతి వచ్చింది. ఆ తర్వాత కాసేపటికి యువకుడు వచ్చాడు. ఇద్దరూ ఓ టేబుల్ వద్ద కూర్చుని టిఫిన్ కు ఆర్డర్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో యువతి తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి యాసిడ్ బాటిల్ తీసి యువకుడి ముఖంపై చల్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆ యువకుడు తన మాజీ ప్రియుడని, తనను బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడడంతో తట్టుకోలేకే ఇలా చేశానని యువతి చెప్పింది.
తనకు ఇదివరకే వివాహం జరిగిందని, విడాకులు తీసుకున్నానని పోలీసులకు వివరించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడికి దగ్గరయ్యానని, అతడి తీరు నచ్చక దూరంగా ఉంటున్నానని చెప్పింది. అయితే, విడిపోయినా తనను వేధిస్తుండడంతో తట్టుకోలేకపోయానని యువతి తెలిపింది. కాగా, ఈ దాడిలో యువతికి కూడా యాసిడ్ గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స చేయించాక అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పేర్కొన్నారు.