జూనియర్ అసిస్టెంట్లకు ఈవోలుగా ప్రమోషన్... దసరా ముంగిట తెలంగాణ సర్కారు నిర్ణయం
- తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణ ఫలించింది
- 33 మంది జూనియర్ అసిస్టెంట్లకు ఈవోలుగా పదోన్నతి
- మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా పదోన్నతి పత్రాలు అందుకున్న నూతన ఈవోలు
దేవాదాయ ధర్మాదాయ శాఖలో దశాబ్దాలుగా ప్రమోషన్ లేకుండా పని చేస్తున్న ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మూడు దశాబ్దాలుగా పదోన్నతుల కోసం వేచి చూస్తున్న ఎదురు చూపులు ఫలించాయి. దసరా పండుగకు ముందు ప్రమోషన్‌లకు సంబంధించి జీవో 134ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో ద్వారా 33 మంది జూనియర్ అసిస్టెంట్లు గ్రేడ్ - 3 ఈవోలుగా ప్రమోషన్ పొందారు.
సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఉద్యోగులు పదోన్నతి పత్రాలు అందుకున్నారు. తమకు ప్రమోషన్లు రావడంతో నూతన ఈవోలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ .. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజా సంక్షేమంతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు.
ఇప్పటికే గ్రేడ్ -1, గ్రేడ్ 2 ఈవోలుగా పలువురికి ప్రమోషన్లు కల్పించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగులు దేవాలయాల ప్రగతికి, ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలని మంత్రి కోరారు.