నేను కేసీఆర్ ఫాంహౌస్ వద్ద దీక్ష చేపడతా: జగ్గారెడ్డి
- రుణమాఫీ చేయలేదంటూ కాంగ్రెస్ సర్కారుపై హరీశ్ రావు విమర్శలు
- ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరిక
- ఏ ముఖం పెట్టుకుని హరీశ్ ఢిల్లీ వెళతాడంటూ జగ్గారెడ్డి ఫైర్
రుణమాఫీ చేయలేదని అదేపనిగా విమర్శిస్తున్న హరీశ్ రావు తమ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ఎదుట దీక్ష చేస్తానంటున్నాడని, ఈ పరిస్థితికి కారణం మీరే అని తాను కేసీఆర్ ఇంటి ఎదుట దీక్ష చేపడతానని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి హెచ్చరించారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రజలను నిండా ముంచాడని, ఇప్పుడు హరీశ్ రావు ఏ ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తాడని జగ్గారెడ్డి మండిపడ్డారు.
మల్లన్న సాగర్ రైతుల వీపులు పగులగొట్టింది ఎవరు? ఖమ్మం రైతులకు బేడీలు వేసింది ఎవరు?... అప్పుడు హరీశ్ రావు ఏం చేస్తున్నారు? అంటూ నిలదీశారు. రైతుల కడగండ్లకు కేసీఆర్, హరీశ్ రావు చేసిన తప్పులే కారణమని జగ్గారెడ్డి ఆరోపించారు.
రుణమాఫీపై చర్చకు తాను సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తానని... మరి హరీశ్ రావు ఈ చర్చకు కేసీఆర్ ను ఒప్పించి తీసుకురాగలడా? అని ప్రశ్నించారు. సాంకేతిక కారణాల వల్లే కొందరికి రుణమాఫీ జరగలేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.