‘త్రికాల’ టైటిల్ పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజు
- శ్రద్ధాదాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా త్రికాల
- మణి తెల్లగూటి దర్శకత్వంలో చిత్రం
- చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పిన దిల్ రాజు
శ్రద్ధాదాస్ , అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న భారీ చిత్రం ‘త్రికాల’. ఈ చిత్రానికి మణి తెల్లగూటి దర్శకుడు. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్.
కాగా, త్రికాల చిత్రం టైటిల్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. టైటిల్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం మేకర్స్ కు, యూనిట్ కు దిల్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఘనవిజయం అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
రాధికా శ్రీనివాస్ నిర్మాత గా, శ్రీసాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్ లు సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యమున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ బడ్జెట్‌తో ఫాంటసీ, హారర్ జోనర్ మూవీగా కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. కుమారి ఖండాన్ని పరిచయం చేస్తూనే మూల కథకు పురాణ నేపథ్యంతో పాటు నూతన హంగులను అద్దుతూ టీమ్ సినిమాను ఆవిష్కరించింది.
దేవి చిత్రంలో బాల నటుడిగా మెప్పించిన మాస్టర్ మహేంద్రన్ ఈ చిత్రంతో ప్రధాన పాత్రలో ఆడియన్స్ ముందుకు వస్తుండడం విశేషం. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఈ సినిమాను దర్శకుడు మణి తెల్లగూటి అండ్ టీమ్ రూపొందిస్తున్నారు. త్వరలోనే మరికొన్ని విశేషాలను తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
ఇందులో శ్రద్ధాదాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్, సాహితి ఆవంచ, తనికెళ్ళ భరణి, ఆమని, అర్జున్ అంబటి, ఐశ్వర్య, సాయి దీన, రవి వర్మ, రోహిణి, యాదంరాజు, దేవిప్రసాద్, నంద దురసిరాజ్, వాసు విక్రం, దయానంద్, ఛత్రపతి శేఖర్, హేమంత్, ఫిష్ వెంకట్, శ్రీసుధ, జీవా, సూర్య, ఈటీవీ ప్రభాకర్ తదితరులు నటించారు. ఈ భారీ చిత్రంలో పాటలకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు. షాజిత్ హుమాయూన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.