చిన్నారి చనిపోతే ప్రభుత్వం స్పందించలేదు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- పుంగనూరులో హత్యకు గురైన చిన్నారి
- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి
- ఇంత వరకు సీఎం స్పందించలేదని మండిపాటు
పుంగనూరులో కిడ్నాప్ కు గురై, ఆ తర్వాత హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ... చిన్నారి మృతి కలచివేసిందని చెప్పారు. చిన్నారి దారుణ హత్యకు గురైనా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ లేదని, పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా రాలేదని కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగితే... కూటమి ప్రభుత్వం డీజీపీకి హెలికాప్టర్ ఇచ్చి పంపిందని... కానీ, చిన్నారి చనిపోతే మాత్రం ఇప్పటి వరకు సీఎం కానీ, మంత్రులు కానీ స్పందించలేదని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. పోలీసులు వెంటనే స్పందించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 9వ తేదీన బాధిత కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని చెప్పారు.