రేవంత్ ను టార్గెట్ చేస్తూ.. కేటీఆర్ భారీ ట్వీట్
- మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరని ప్రశ్నించిన కేటీఆర్
- రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరని ప్రశ్న
- పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా? అని విమర్శ
రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టిన ప్రభుత్వం... మూసీలో మురికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ... రైతులను మోసం చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు.
"మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు? రైతు రుణమాఫీ ఎగ్గొట్టి, మూసీలో మురికి రాజకీయాలు చేస్తున్న మురికి దొంగ ఎవరు? రైతు బంధు ఎగ్గొట్టి, మూసీ పేదల ఉసురు పోసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు? మహిళలకు వంద రోజుల్లోనే నెలకు 2,500 ఇస్తా అని చెప్పి తప్పించుకు తిరుగుతున్న మోసగాడు ఎవరు? అవ్వ, తాతలకు నెలకు 4,000 ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టిన నయవంచకుడు ఎవరు? ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఇస్తా అని మాట తప్పిన దగావీరుడు ఎవరు? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట రూ. 1,500,000,000 కోట్ల లూటిఫికేషన్ కి తెరతీసిన ఘనుడు ఎవరు?
బతుకమ్మ అంటే గిట్టదా.. పట్టదా ఈ ముఖ్యమంత్రికి? ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురావట్లేదా? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి.. చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం? ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? బతుకమ్మ చీరలను రద్దు చేసారు. ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా?" అని కేటీఆర్ ప్రశ్నించారు.