విజయవాడ తూర్పు బైపాస్ కు గ్రీన్ సిగ్నల్
- ఏపీలో 9 ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసిన కేంద్రం
- 50 కి.మీ. విజయవాడ తూర్పు బైపాస్
- బైపాస్ నిర్మాణానికి రూ. 2,716 కోట్ల మంజూరు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ఫలించాయి. విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడలో 7 కిలోమీటర్ల మేర సూపర్ స్ట్రక్చర్ వంతెన నిర్మాణం వంటి ప్రాజెక్టులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తన 2024-25 వార్షిక ప్రణాళికలో చేర్చింది. వీటితో పాటు రాష్ట్రంలో 9 ప్రాజెక్టులను వార్షిక ప్రణాళికలో చేర్చింది. ఈ ప్రాజెక్టుల కోసం రూ. 12,029 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
చిన్న అవుటపల్లి నుంచి కాజ వరకు ప్రస్తుతం నిర్మిస్తున్న విజయవాడ బైపాస్ కు అభిముఖంగా మరో బైపాస్ (తూర్పు బైపాస్)ను ఎన్ హెచ్ఏఐ నిర్మిస్తోంది. 50 కిలోమీటర్ల మేర ఈ బైపాస్ ను నిర్మించబోతున్నారు. ఈ బైపాస్ కు రూ. 2,716 కోట్లు కేటాయించారు.