సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన సీఎం చంద్ర‌బాబు

  • తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర సిట్‌తో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం
  • ఐదుగురు సభ్యులతో స్వ‌తంత్ర‌ దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని సూచ‌న‌
  • సుప్రీంకోర్టు తీర్పుపై ఎక్స్ వేదికగా స్పందించిన చంద్ర‌బాబు
  • సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్న‌ట్లు పేర్కొన్న ముఖ్య‌మంత్రి
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర బృందంతో విచారణ జరిపించడం మంచిదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. ఐదుగురు సభ్యులతో స్వ‌తంత్ర‌ దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని జస్టిస్‌ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు సీబీఐ, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్‌ సేఫ్టీ అధికారి ఉండాల‌ని సూచించారు. 

ఇక అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పును సీఎం చంద్ర‌బాబు స్వాగ‌తించారు. సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ మేర‌కు చంద్ర‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు. "తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తునకు సీబీఐ, ఏపీ పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన‌ ఆదేశాలను స్వాగతిస్తున్నాను. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు.


More Telugu News