శ్రీశైలం దేవస్థానంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ .. ప్రసాదాల నాణ్యతపై పరిశీలన

  • శ్రీశైలం దేవస్థానంలో నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
  • లడ్డూ ప్రసాదం నాణ్యతపై అధికారుల పరిశీలన 
  • ల్యాబొరేటరీకి శాంపిల్స్ తరలింపు
శ్రీశైలం మల్లికార్జునస్వామి వారి ఆలయంలో నంద్యాల ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రసాదాల నాణ్యతపై పరిశీలన చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు షేక్ ఖాసింవలి, ఓవీ రాముడు గురువారం లడ్డూ తయారీని పరిశీలించారు. లడ్డూ ప్రసాదంలో వినియోగిస్తున్న పదార్ధాలు, ఆలయానికి సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను వారు పరిశీలించారు. అలానే లడ్డూ కౌంటర్‌ల వద్ద భక్తులకు అందిస్తున్న లడ్డులను పరిశీలించారు. 

గత వారంలో కూడా అధికారులు పడి తరానికి సరఫరా అయ్యే వస్తువులు, నెయ్యి శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ లోని నాచారం ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్న విషయం వివాదాస్పదంగా మారడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పుఢ్ సేఫ్టీ అధికారులు ఆలయాల్లో ప్రసాదాల నాణ్యత, ప్రసాదాల్లో ఉపయోగించే వస్తువులను తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం దేవస్థానంలోనూ అధికారులు పరిశీలన జరిపారు.


More Telugu News